కరోనాపై శ్వాసకోస వైద్యుల సలహాలు/జాగ్రత్తలు

కరోనాపై శ్వాసకోస వైద్యుల సలహాలు/జాగ్రత్తలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా…
ఆందోళన అవసరం లేదంటున్న వైద్యులు.
జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న లంగ్స్ డాక్టర్.

-ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్నారు వైద్యులు. ఈ మేరకు ముందస్తు సూచనలు చేస్తున్నారు. ముంబై కీ చెందిన ఊపిరితిత్తుల ప్రత్యేక డాక్టర్ సునీల్ కార్ఖానిస్ కరోనా వైరస్ ఎంత..? ప్రమాదకారినో..?, ఎలా వ్యాప్తి చెందుతుంది..?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే సూచనలు చేశారు. డాక్టర్ సునీల్ అల్లుడు సైతం కూడా లంగ్స్ స్పెషలిస్ట్. మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్. అతను చైనాలోని షెంజెన్ హాస్పిటల్లో వైద్యుడిగా ఉన్నారు. వూహాన్ న్యూమోనియా వైరస్ పై అధ్యయనం కోసం అతనిని అక్కడకు బదలీ చేశారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ఇక్కడ అధ్యయనం చేసిన అనంతరం డాక్టర్ సునీల్ అల్లుడు చెప్పారు.ఆ వివరాలేంటో చూద్దాం…

లక్షణాలు ఇవే:
– వైరస్ మొదట గొంతుకు సోకుతుంది. 3 నుంచి 4 రోజుల పాటు గొంతు పొడిగా అనిపిస్తుంది. తర్వాత వైరస్ నాసికా ద్రావంలో కలిసిపోయి శ్వాసనాళంలోకీ వెళ్లి ఉపిరితిత్తుల్లోకీ ప్రవేశిస్తుంది. అప్పుడు వ్యాధికీ కారణమవుతుంది. ఇది జరిగేందుకు 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. దీనికారణంగా అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. నీటిలో మునిగి క మాదిరిగా అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలనీ డాక్టర్లు చెబుతున్నారు.జలుబుతో ముక్కు కారటం, దగ్గితే వచ్చే తెమడ ఉంటే వైరస్ సోకినట్లు భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముక్కు కారడం, తెమడ లేని దగ్గు మాత్రమే రావడం కరోనా లక్షణాలు.. అంతేకాకుండా వైరస్ వేడిని తట్టుకోలేదు.30 నుంచి 35 డిగ్రీల వద్ద చని పోతుంది. ఎంత వేడి నీరు తాగితే అంత మంచిది.ఇంకా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి నీరు తాగడం మంచిదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వల్ల వ్యాధి నీ నివారించలేకపోవచ్చు కానీ వ్యాధి నీ నివారించేందుకు ఒక చక్కటి మార్గం. వేడినీరు అన్ని వైరస్ లను దూరం చేస్తుందనీ వైద్యులంటున్నారు. సాధ్యమైనంత వరకు చల్లటి నీటికీ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

పరిమాణంలో పెద్దది:
– కరోనా వైరస్ పరిమాణంలో పెద్దది. ఒక సెల్ 400-500 nm వ్యాసం ఉంటుంది. అందువల్ల n-95 మాత్రమే కాకుండా సాధారణ మాస్క్ సైతం ఫిల్టర్ చేయగలదు. కరోనా సోకిన వ్యక్తి తుమ్మితే మూడు మీటర్ల కు మించి వెళ్లలేదు. అంటే గాలిలో ఎక్కువ కాలం ఉండలేదనీ దాని అర్థం. అదేవిధంగా వైరస్ మెటల్ ఉపరితలం పై పడితే కనీసం 12 గంటలు ఉంటుంది. ఇనుప వస్తువు ఏదైనా తాకితే సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలనీ డాక్టర్లు చెబుతున్నారు. ఫ్యాబ్రిక్ పైన దాదాపు 12 గంటల వరకు యాక్టీవ్ గా ఉంటుంది. సాధారణ లాండ్రీ డిటర్జెంట్ వైరస్ ను చంపుతుంకది. శీతాకాలంలో వేసుకునే దుస్తులు ప్రతి రోజు ఉతకలేం.అయితే వాటిని కనీసం 4 గంటలు సూర్యకాంతి పడేలా ఎండకు పెడితే వైరస్ చనిపోతుంది.

నివారణ చర్యలు ఇవే:
– వ్యాధి బారిన పడే బహిరంగ వస్తువులను తాకవద్దు. అలా చేస్తే వెంటనే చేతులు కడుక్కోవాలి. వైరస్ 5 నుండి 10 నిమిషాలు మాత్రమే జీవిస్తుంది. కానీ ఆ 5-10 నిమిషాల్లోనే చాలా నష్టం జరుగుతుంది. కళ్లను రుద్దడం ముక్కులో వేలి పెట్టే పరిస్థితులు ఉంటాయి. అలా చేయవద్దు.చేతులను తరుచూ శుభ్ర‌ప‌ర్చుకోవ‌డం ఎంతో మంచిది. అంతేకాదు ఇది గొంతులో ఉన్న సమయంలోను జాగ్రత్తల ద్వారా ఊపిరితిత్తులకు చేరకుండా చేసుకోవచ్చు. గొంతులో ఉన్నప్పుడు సూక్ష్మక్రీములను తొలగించేందుకు లేదా తగ్గించేందుకు ఉప‌యోగించే బెటాడిన్ పుక్కిలించి ఉమ్మివేయ‌డం ద్వారా