దసరా పండుగకే రానున్న ‘రాధే శ్యామ్’?

దసరా పండుగకే రానున్న ‘రాధే శ్యామ్’?

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు ‘రాధే శ్యామ్’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ పాటికే ఈ సినిమా థియేటర్లకు వచ్చి ఉండవలసింది. కానీ కరోనా కారణంగా షూటింగుకి ఆటంకాలు ఎదురౌతూ ఉండటం వలన, ఆలస్యమవుతూ వచ్చింది. కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటం వలన, త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయనే టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ సినిమా త్వరలో విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.అయితే త్వరలో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ, పూర్తిస్థాయి ఆక్యుపెన్సీతో షోలు పడటానికి మరికొంత కాలం పడుతుంది. అందువలన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. బహుశా దసరాకి ఈ సినిమాను విడుదల చేయవచ్చని అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించాడు. కృష్ణంరాజు .. భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.