ఇండస్ట్రీకి వచ్చింది సుఖం కోసం కాదంటున్న లెజెండ్ బ్యూటీ

రాధికా ఆఫ్టే బోల్డ్ క్యారెక్టర్లు, బోల్డ్ స్టేట్మెంట్స్ కి కేరాఫ్ అడ్రస్. అలాంటి హీరోయిన్ తన కోసం బోల్డ్ కధలను వండుతున్న దర్శకులపై ఫైర్ అయింది. తెర మీద పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రం లేదని…నగ్నంగా, రొమాంటిక్ సీన్స్ చేసేందుకు ఇప్పటికి సిద్ధమే. కానీ, చాలా మంది దర్శకులు నన్ను అలాంటి పాత్రల కోసమే సంప్రదిస్తున్నారు. అహ‌ల్య‌, బ‌ద్లాపూర్ వంటి చిత్రాల్లో ఆమె న‌గ్నంగా న‌టించారు. దీంతో రాధికా ఆప్టేకు అలాంటి క‌థా నేప‌థ్యం ఉన్న పాత్ర‌ల‌ను క్రియేట్ చేసి… ద‌ర్శ‌కులు ఆమె ద‌గ్గ‌రికి వెళుతున్నారు. న్యూడ్‌గా నటించాల‌ని ఆమెను ద‌ర్శ‌కులు వెంట‌ప‌డుతున్నారు. దీంతో న‌గ్నంగా నిల‌బెట్టేందుకే క‌థ‌ల‌ను త‌యారు చేసుకొస్తే ఎలా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. కేవలం సెక్స్ చేయడం కోసమే తను ఇండస్ట్రీకి రాలేదని రాధికా అగ్రహించినట్లు సమాచారం.