వైద్య పరీక్షలే వజ్రాయుధం: రాహుల్ గాంధీ

దేశ శ్రేయస్సు కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో విభేధిస్తాను కానీ తనకు ఎలాంటి బేధాభిప్రాయం లేదని
కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్నారు.

భారత దేశంలో ప్రజలు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు, లాక్ డౌన్ ఓ పాస్ బటన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో Nనుంచి రాహుల్ గాంధీ వీడియోకాల్ మాధ్యమంతో జాతీయ మీడియాతో మాట్లాడారు.

లాక్‌ డౌన్‌ కారణంగా కరోనా వ్యాప్తి తాత్కాలికంగా మాత్రమే అడ్డుకుంటామని మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని అభిప్రాయబడ్డారు. దేశంలో కరోనా కట్టడికి వైద్య పరీక్షలు, వైద్య సదుపాయాలు గణనీయంగా పెంచాలని కోరారు. కోవిడ్-19 వైద్య పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగట్లేదని రాహుల్ తెలిపారు. గంప గుత్తగా ర్యాండమ్‌ పద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించడమే వజ్రాయుధమని రాహుల్ ఆవేదనతో మీడియా ముందు అభిప్రాయాలను పంచుకున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకుని తొలుత పేదలు, కూలీల ప్రాణాలు కాపాడాలన్నారు.