రైల్వేలో కరోనా ఐసోలేషన్ వార్డులు

దేశవ్యాప్తంగా కరోనా మహామ్మారి బుసలుకోడుతున్న నేపథ్యంలో వైరస్ కారణంతో చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక అడుగులు వేసింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించేందుకు ‘ఐసోలేషన్ కోచ్’ సిధ్ధం చేసినట్లు ప్రకటించింది.

ప్రతి ‘ఐసోలేషన్ కోచ్’ లో 10 వార్డులు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే సైడ్ మిడిల్ బెర్త్ లను తొలగించి ఒక్కో కూపేలో ఇద్దరి నుంచి నలుగురు వరకు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ సమాచారం అందించింది. వైరస్ సమస్యలు ఎదుర్కొంటు ఐసోలేషన్ లెవల్ వరకు వచ్చే వ్యక్తులకు సామాగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలు ఏర్పాటు చేసారు. వైద్య పరికరాల సౌకర్యం కోసం కంపార్టుమెంట్లో 220W విద్యుత్ అనుసంధానం చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ సోకిన వారికి ఐసోలేషన్ అందించడానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ సిద్ధం చేస్తున్నారు.