గ్రీన్ జోన్లలో ఎలా?? బొమ్మ బొరుసంతే

దేశంలో కరోనా సోకని గ్రీన్ జోన్లలో యధావిధిగా పనులు కొనసాగుతున్నాయి. ఈశాన్య రైల్వే విభాగం బీహారులో పలు ప్రాంతాల్లో రైల్వే నిర్మాణ పనులు, పర్యవేక్షణ పనులు చకచకా సాగుతున్నాయి. కరోనాతో రెడ్ జోన్లలో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయమేస్తుంటే మరోవైపు ఇక్కడేమో మన ఆర్థిక వ్యవస్థ ఇరుసును కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ డివిజనులోని కొత్తూర్, కుందుర్గ్, నందిగామ, ఫరూక్ నగర్, చౌదరిగూడ, కేశంపేట మండలాల్లో MNREGA పనులు ఎంచక్కా జరుగుతున్నాయి. కరోనాలో ధైర్యంగా సామాజిక దూరం పాటిస్తూ కార్మికులు పనులు చేసేందుకు కదం తొక్కారు.