వడగండ్ల వర్షం-రైతుల విలవిల

తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు కన్నీరు మిగులుస్తున్నాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయపల్లి, ఖిల్లాఘనపురం మండలం సోళీపూర్, ఘణపురం, అల్లమాయపల్లి, తిర్మలాపూర్ గ్రామాలలో వడగండ్ల వాన మూలంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ పరిశీలించారు.

పంటనష్టం అంచనా వేయండి:
– రాష్ట్రంలో వడగండ్ల వాన కురిసిన చోట రైతులకు భారీనష్టం
– భీమా కంపెనీల పరిధిలో నష్టపరిహారం అందే అంశాలను అంచనా వేస్తున్నాము.
– వాటి పరిధిలోకి లేనటువంటి రైతులను జాతీయ విపత్తు నిధి ద్వారా ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం
– పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరతాం
– అకాల వర్షానికి వరి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు
– ఏప్రిల్ లో అకాలవర్షాలు వస్తాయి కాబట్టి రైతులు యాసంగి పంటను మార్చి నెలలోనే కోతకు వచ్చేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి
– ఆ దిశగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులను చైతన్యం చేస్తాం
– ఇన్నేండ్లూ వర్షాధార పంటలు పండించుకునే వాళ్లం
– తెలంగాణ వచ్చాక కాల్వల ద్వారా సంతోషంగా రైతులు పంటలు పండించుకుంచున్నారు
– పంట చేతికొచ్చే ప్రస్తుత తరుణంలో వడగండ్ల వాన రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరం
– నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకునే అన్ని అవకాశాలనూ పరిశీలించి రైతులను ఆదుకుంటాం
– పంట నష్టం వివరాలు సేకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.