నిరసనలకు అభిమానులు దూరంగా ఉండాలన్న రజనీ

నిరసనలకు అభిమానులు దూరంగా ఉండాలన్న రజనీ

తాను రాజకీయాల్లోకి రావడం లేదని, పాలిటిక్స్ లోకి ప్రవేశించకుండానే సేవ చేస్తానని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, గత నెల చివరి వారంలో స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత, పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తాను ఓ నిర్ణయం తీసేసుకున్నానని ఆయన తెలిపారు. అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు. “కొంతమంది నా అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నుంచి తొలగించబడిన స్థానిక నేతలు నేను తిరిగి రాజకీయాల్లోకి రావాలని చెన్నైలో నిరసనలు తెలుపుతూ నా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నా నిర్ణయాన్ని నేను తీసేసుకున్నాను. దాన్ని అందరికీ చెప్పాను. ఇటువంటి నిరసనలకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ ఘటనలు నాకు బాధను కలిగిస్తున్నాయి” అని ఆయన అన్నారు.