సభ్యత్వం పూర్తయిన వెంటనే తన పార్టీని ప్రారంభించనున్న రజినీకాంత్

సభ్యత్వం పూర్తయిన వెంటనే తన పార్టీని ప్రారంభించనున్న రజినీకాంత్

తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ‘మక్కల్ మండ్రం’లో సందడి మొదలైంది. త్వరలోనే పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో తన ఆర్గనైజేషన్ మక్కల్ మండ్రంలో కొత్త సభ్యులను ముమ్మరంగా చేర్పించాలని ఆయా జిల్లాల శాఖ నాయకులను రజనీకాంత్ ఆదేశించారు. అధినేత ఆదేశాలతో నేతలు సభ్యత్వ ఫారాలు పట్టుకుని కొత్త సభ్యులను చేర్పించే పనిలో బిజీగా మారారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంఘంలో రెండు నెలల క్రితమే బూత్ కమిటీ సభ్యుల ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆన్‌లైన్‌లో సభ్యత్వాన్ని ప్రారంభించగా, ఆ దశగా ప్రయత్నించాలని ఆయా శాఖల నాయకులను రజనీ కోరారు. అలాగే సభ్యులుగా చేరిన వారికి వెంటనే ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వాలని సూచించారు. సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన వెంటనే రజనీ తన పార్టీని ప్రారంభిస్తారని చెబుతున్నారు.