గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రకుల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రకుల్

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ‘గ్రీన్ ఇండియా’ చాలెంజ్ ఓ ఉద్యమంలా ముందుకు వెళ్తోంది. మొక్కలు నాటడంలో హీరో, హీరోయిన్లు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టాలీవుడ్ యువనటుడు అక్కినేని నాగచైతన్య గతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి చాలెంజ్ విసిరాడు. చాలా కాలం తర్వాత రకుల్ ఈ చాలెంజ్ లో పాల్గొంది. మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోస్తూ ఫొటోలు దిగి పోస్టు చేసింది. తాను నటులకి చాలెంజ్ చేయబోనని, తన ఫ్యాన్స్ అందరికీ చాలెంజ్ చేస్తున్నానని రకుల్ చెప్పుకొచ్చింది. అందరూ మూడేసి మొక్కలు నాటాలని సూచించింది. తనకు ఈ అవకాశం కల్పించేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపింది.