వర్మ మార్క్ విమర్శలు

ట్విట్ట‌ర్ వేదిక‌గా కేఏ పాల్‌పై వ‌ర్మ‌ తీవ్ర వ్యాఖ్య‌లు
కరోనాను తీసేయమని దేవుడితో చెప్పొచ్చు కదా..!
ఎద్దేవా చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

– రామ్‌గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల కాలంలో సంచలనాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తోన్న విష‌యం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ట్వీట్లు పెడుతున్నారు. రకరకాల డౌట్లు వేస్తూ అందర్నీ ప్రశ్నిస్తున్నారు. ఈసారి వర్మ కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు. ‘ అరే కేఏ పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు.. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చినట్లు చేయి యంకమ్మ’ అని కేఏ పాల్ ‌పై సెటైర్లు వేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయ‌డంతో హీట్ పెరిగింది.

– కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయని… అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని… కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆఫర్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. దీంతో ‘అరేయ్ కేఏ పాల్… ఈ సుత్తి సలహాలను ఇచ్చే బదులు.. నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావ్. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే… నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేటట్టు చేయి ఎంకమ్మా’ అంటూ ట్విట్టర్ ద్వారా పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!