హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నా రానా దంపతులు

హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నా రానా దంపతులు

సినీ నటుడు రానా తన స్నేహితురాలు మిహీకా బజాజ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కరోనా టైమ్ లో వీరి వివాహం జరిగింది. దీంతో పెళ్లైనా వీరు ఎక్కడకీ వెళ్లలేకపోయారు. తాజాగా కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టడంతో కొత్త జంట హానీమూన్ కి బయల్దేరింది. ఇద్దరూ కలిసి బీచ్ లో దిగిన ఫొటోను మిహీకా తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు. అయితే, తాము ఎక్కడకు వెళ్లామనే విషయాన్ని మాత్రం వారు సీక్రెట్ గా ఉంచారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.