వెన్నె చిలకడం నేర్చుకున్న మెగాపవర్ స్టార్ రాంచరణ్

లాక్ డౌన్ పుణ్యమాని సినీ ప్రముఖులందరూ వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. షూటింగులు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటూ వారి చేతివాటన్ని చూపుతున్నారు. కొందరు వర్క్ అవుట్స్ లో బిజీగా ఉంటే మరి కొందరు వంట గదిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మొన్న మెగాస్టార్,నిన్న డైలాగ్ కింగ్,నేడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కూడా కిచెన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తల్లి సురేఖ, నాన్నమ్మల నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. వెన్నె తీసే వీడియోను రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘తాజా వెన్నను తయారు చేయడం నేర్చుకుంటున్నా’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక రామ్ చరణ్ ని నాన్నమ్మ కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోకే హైలైట్ .

ఈ వీడియోలో రామ్ చరణ్ తన తల్లి సురేఖ – నాన్నమ్మ అంజనాదేవి పర్యవేక్షణ లో వెన్న తీయడం పూర్తి చేశాడు. మనవడిని ముద్దుగా కృష్ణుడంటూ గారం చేసింది నాన్నమ్మ. వెనుకటి రోజుల్లో పెరుగు నుండి వెన్న తీయడానికి కవ్వం ఉపయోగించే వాళ్ళు. కానీ రామ్ చరణ్ ఎలక్ట్రిక్ మిషన్ తో వెన్న తీయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.