కాస్త ఆలస్యమైనా రేంజ్ రోవర్ గిఫ్ట్

కాస్త ఆలస్యమైనా రేంజ్ రోవర్ గిఫ్ట్

మెగా సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గత సంవత్సరం డిసెంబర్ లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత నీహారిక తన సంసారంపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరాలను అభిమానులతో పంచుకుంటూనే ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన అల్లుడికి నాగబాబు ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చారు. వాస్తవానికి ఈ బహుమతి ఉగాది సందర్భంగా ఇవ్వాల్సి వుందని, కానీ కాస్తంత ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు. దీని ఖరీదు రూ. 70 లక్షల వరకూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని, వీడియోను నాగబాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.