తిరుమలలో సందడి చేసిన రష్మిక శర్వానంద్

తిరుమలలో సందడి చేసిన రష్మిక శర్వానంద్

ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికా మందన్నా దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో వచ్చిన వీరికి ఆలయ అధికారులు దర్శనం చేయించారు. ఆపై ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని కోరేందుకు తాము వచ్చామని దర్శనం అనంతరం ఆలయం వెలుపల వారు మీడియాకు వివరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఫ్యాన్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఈ జంట, త్వరలోనే తమ కొత్త సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు.