APలో రేషన్ పంపిణీ రికార్డులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిరోజు 21 లక్షల 46 వేల 900 కుటుంబాలకు జగన్మోహన్ సర్కారు ఉచిత రేషన్ పంపిణీ చేసింది. మూడో విడతలో భాగంగా మొత్తం 32,026. 675 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,149.940 మెట్రిక్ టన్నుల కంది పప్పు పంపిణీ చేసారు. పోర్టబులిటీ ద్వారా రేషన్ అందుకున్న 4,73,537 కుటుంబాలు, రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు, సబ్బు, నీటిని అందుబాటులో వుంచిన డీలర్లు, బయోమెట్రిక్ ఉపయోగించి రేషన్ కార్డుదారులు తీసుకున్నారు. టైం స్లాట్ ద్వారా భౌతిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకున్న లబ్ధిదారులు, రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.