పీవీతో అనుబంధం అనిర్వచనీయం నెమరేసుకున్న డాక్టర్ రవి అయ్యగారి.

పివి నరసింహ రావు శ‌తాబ్ది జ‌యంతి ఉత్స‌వాల సందర్భంగా
2002లో ఢిల్లీలో పివికి జియార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కోసం నిర్మించిన కైలాష్ మానస సరోవర్ యాత్ర డాక్యుమెంటరీ CDలను PVకి అందించిన మధుర క్షణాలను డాక్టర్ రవి అయ్యగారి, సీనియర్ ఆకాడమిషన్, అనంతపూర్ JNTU గవర్ణింగ్ బాడీలో సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఓ తెలుగు తేజం ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించడం సమర్ధవంతంగా భాద్యతలు నిర్వర్తించి దేశ రక్షణ, అభివృద్ధిలో PV కృషిని డాక్టర్ రవి కొనియాడారు. దేశం ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తుండటంలో PV నరసింహారావు పాత్ర చెరగని ముద్రను వేసుకున్నదని శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు.

ఈ సమావేశం తర్వాత పీవీ నరసింహారావు కైలాష్ యాత్రలో రవి అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. 2001-2002 సమయంలో కైలాష్ యాత్రకు సరైన రహదారి లేదు, కఠినమైన వాతావరణం, వందకు పైగా కిలోమీటర్ల దూరం నడక, ఆహారం, ఆరోగ్య రక్షణ అంశాలు ఎదురైన సవాళ్లు, పరిస్థితులను డాక్టర్ రవి అయ్యగారి, సీనియర్ ఆకాడమిషన్, అనంతపూర్ JNTU గవర్ణింగ్ బాడీలో సభ్యులు పీవీకి వివరించిన అంశాలను గుర్తు చేసుకున్నారు.