సీక్వెల్ కి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో రవితేజ

సీక్వెల్ కి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో రవితేజ

లాక్ డౌన్ తరువాత కొత్త ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచిన హీరోల్లో రవితేజ ముందుగా కనిపిస్తున్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఆయన చెలరేగిపోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే ఆయన ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత పెద్దగా గ్యాప్ లేకుండనే ‘ఖిలాడి’ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా తరువాత ఆయన త్రినాథరావు నక్కిన .. శరత్ మండవ దర్శకత్వంలోని సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన ఒక సీక్వెల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ సీక్వెల్ సినిమానే ‘రాజా ది గ్రేట్’.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. రవితేజ అంధుడు అయినప్పటికీ .. ఆయన సినిమాలో ఉండవలసిన అంశాలు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకోవడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఆల్రెడీ ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ చేస్తున్న అనిల్ రావిపూడి, రీసెంట్ గా రవితేజను కలిసి, ‘రాజా ది గ్రేట్ ‘ సినిమా సీక్వెల్ కి కథ చెప్పాడట. కథ సూపర్ గా ఉండటంతో వెంటనే ఆయన ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.