RBI మూడు నెలలు మారటోరియం అంటే?

  • దేశంలో అత్యవసర విపత్కర పరిస్థితులు నెలకొనడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారులు బ్యాంకులకు కట్టాల్సిన నెల కంతులపై మారటోరియం ప్రకటించింది. మూడు నెలలు మారటోరియం సౌలభ్యం కల్పించింది. అంటే మీ నెల కంతులు వాయిదా వేయడం మాత్రమే.
  • అసలు ఈ మారటోరియం ఏంటంటే? RBI మూడు నెలలు ఏప్రిల్, మే అలాగే జూన్ మాసాలు కంతులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆ తర్వాత జూలై నెలలో మూడు నెలల కంతులు ఒకేసారి ఒకే నెలలో కట్టనవసరం లేదు.కానీ ఇప్పుడు ఇచ్చిన వ్యవధి మీ మొత్తం రుణ వ్యవధిలో పెరుగుతుంది.
  • బ్యాంకుకు కట్టాల్సిన కంతుల వివరాల్లో ఉదాహరణకు మీ రుణం 2021 ఏప్రిల్ నాటికి కంతులు పూర్తవుతాయి అనుకుందాం. మీరు మారిటోరియం వ్యవధి ఉపయోగించుకుంటే జులై 2021వరకు మీ వ్యవధి పెరుగుతుంది. ఐతే మారిటోరియం వ్యవధిలో చెల్లించాల్సిన వడ్డీని అసలుకు జమ చేస్తారు. అంటే ఈ మూడు నెలల కాలం చివరి మూడు నెలల్లో కలుస్తుంది.

  • ఓ లెక్క ప్రకారం బ్యాంకుకు ఓ వ్యక్తి 20వేల రూపాయలు EMI కట్టాల్సి ఉందనుకుంటే ఇందులో వడ్డీ 15 వేలు అసలు 5వేల రూపాయలు ఉందనుకుంటే ఈ మూడు నెలలు మారటోరియంలో 45వేలు చెల్లించని వడ్డీ ఉంటుంది. దీన్నిమీ అసలుకు కలుపుతారు. దాంతో మీ అసలు
    మొత్తం + 45వేలు వడ్డీ కలిపి బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది.
  • కాబట్టి ఆర్బీఐ ఇచ్చిన అవకాశంలో మూడు నెలలు ఎలాగో కట్టలేదు అంతకు మించి కుడా వెసులుబాటు RBI ఇవ్వొచ్చు. కానీ సాధ్యమైనంత వరకు యధావిధిగా మీ కంతులు చెల్లించడమే మంచిదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
  • RBI మారిటోరియం ప్రకారం చెల్లింపులు చేయకపోతే ఎలాంటి రుసుము విధించరు. అంతేకాకుండా సిబిల్ స్కోరుపై ఎలాంటి ప్రభావము ఉండదు. RBI నిర్ణయం వెసులుబాటు మాత్రమే కానీ కంతులు రద్దు చేసినట్టు మాత్రం అనుకోరాదు.