ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

కరోనా వైరస్‌ కట్టడిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది.
మార్చి31 నుంచి ఏప్రిల్‌ 17 వరకున్న పరీక్షలు రెండు వారాల పాటు వాయిదా వేసిన విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఏపీలో ఇప్పటికే ఏడుగురు కరోనా వైరస్‌ బారినపడ్డారు. అందుకే పది పరీక్షలు మళ్లీ ఎప్పడు నిర్వహించేది మార్చి 31 తర్వాత పరిస్థితులను
బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్‌, ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు తేదీని కూడా పొడిగిస్తున్నట్టు మంత్రి అన్నారు.