గృహ నిర్బంధం 21రోజులు తప్పనిసరి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

గృహ నిర్బంధం 21రోజులు తప్పనిసరి

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచింది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో వార్తల్లో చూస్తున్నాం. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి. ఒకరికి ఒకరు దూరంగా
ఉంటూ ఇళ్లల్లోనే ఉండాలి. ఈ విధంగా ఉంటే తప్ప
ఈ గండం నుంచి గట్టేక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం కానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇది తప్పనిసరి. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, వీధి లాక్‌డౌన్‌ చేయాల్సిందే. దీన్ని ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ ఒక్క పౌరుడూ గడప దాటి బయటకు
రావొద్దు. జనతాకర్ఫ్యూకు మించి లాక్‌డౌన్‌ అమలు చేస్తాం.
కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.

ఈ రోజు అర్ధ రాత్రి 12 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. 21 రోజుల
పాటు కొనసాగనున్న లాక్ డౌన్. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రావడం పూర్తిగా నిషేధం.కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది.
రానున్న 21 రోజులు చాలా కీలకం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా తొలి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే
3 లక్షలకు చేరింది. ఈ 21రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే మనచేతుల్లో ఏమి ఉండదు. ప్రజలంతా ఒకే లక్ష్యంగా
ఇళ్లలోనే ఉండాలి. ఈ లాక్‌డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికీ లక్ష్మణరేఖ వంటిది.వైద్య సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయించాము. ఆరోగ్య సేవలకే తొలి ప్రధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నాను. సంక్షోభ సమయంలో భుజం భుజం కలిపి పనిచేయాలి. కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం ఇదే విషయంపై ఆలోచిస్తున్నాయి.నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాము. కేంద్ర, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. ఎలాంటి పుకార్లు, వదంతులు, మూఢనమ్మకాలు నమ్మవద్దు. కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే మార్గదర్శకాలు పాటించాలి. వైద్యుల సలహా లేకుండా
ఎలాంటి మందులు తీసుకోవద్దు. నిర్లక్ష్య ధోరణితో మందులు తీసుకుంటే మరింత ప్రమాదంలో పడతారు. 21 రోజుల లాక్‌డౌన్‌ పాటించడం మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు.
ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదు. ఈ దేశంలో
ఏం జరిగినా ఇళ్లలోనే ఉండాలి. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. ఏం జరిగినా ఇంటిచుట్టూ ఉన్న లక్ష్మణరేఖ దాటి రావొద్దు. కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.