కరోనా RBI కీలక నిర్ణయాలు

దేశంలో కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల టర్మ్‌ లోన్ల ఈఎంఐలపై 3 నెలల మారటోరియం విధించింది. రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం ఇది 4.4 శాతానికి చేరింది. బ్యాంకుల్లో డబ్బులు భద్రంగా ఉంటాయని తెలిపింది. అంతే కాకుండా RBI 3.74 లక్షల కోట్లు మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఫిబ్రవరిలో విధాన సమీక్ష తర్వాత మార్కెట్లోకి దాదాపు 2.7లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. కానీ కరోనా వైరస్ స్థితిగతుల్లో మార్పులు రాకపోతే ఆర్థికంగా ప్రమాదం పొంచి ఉన్నట్టేనని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.