కరోనా సంక్షోభంలో RBI మరో ప్రకటన

దేశంలో కరోనా సంక్షోభ సమయంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) మరో ప్రకటన చేసింది. ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండటాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రశంసించారు.

ఏప్రిల్17 ముంబయి నగరం RBI ప్రధాన కార్యాలయంలో మీడియాతో RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ మాట్లాడారు.
కోవిడ్-19 పిశాచి ప్రకోపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయ్యాయని, RBI ఎదురవుతోన్న సవాళ్లను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందని, రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భారతదేశంలో ఖరీఫ్‌ సీజన్ కారణంగా 36% ధాన్యం ఉత్పత్తి, మన GDP 1.9%గా.ఉండబోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.

G20 దేశాల్లో భారత్‌ జీడీపీనే కాస్త మెరుగ్గా ఉందని, జీడీపీలో 3.2% ద్రవ్యం అందుబాటులోకి మనమే తీసుకు వచ్చామని, దేశంలో బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతుండటం హర్షణీయమన్నారు.మన దేశ ఆర్థిక వృద్ధి1రేటు 2021-22లో 7.4% ఉండగా ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధి రేట్లు మాత్రం తిరోగమనంలో ఉన్నాయన్నారు. మార్చిలో లాక్‌ డౌన్‌ ప్రకటన వచ్చినప్పటి నుంచి 1.20₹ లక్షల కోట్లు విడుదల చేసిన విషయాన్ని తెలిపారు. దేశ వ్యాప్తంగా 91% ATMs పనిచేస్తున్నాయని, బ్యాంకు సిబ్బంది ATMsలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నారని, మన దేశ బ్యాంకుల్లో దవ్ర లభ్యత మంచిగా ఉందని RBI గవర్నర్ శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించారు.

RBI రివర్స్ రెపో రేటును 4% నుండి 3.75% కు తగ్గిస్తోంది.
COVID-19 నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు డివిడెండ్ చెల్లింపు చేయకూడదు. బ్యాంకుల్లో ఇప్పటికే 90 రోజుల ఎన్‌పిఎ ప్రమాణం ఉన్న రుణాలు తాత్కాలిక నిషేధంపై దరఖాస్తు చేయకూడదు.