ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సిందే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 31 నాటికి సర్వీసు ముగిసే
వాళ్ళందరూ పదవీవిరమణ చేయాల్సిందేనని, ఇందులో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్19 ఎదుర్కొనే క్రమంలో విధించిన లాక్‌డౌన్‌తో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు. వీళ్ళలో కొంతమంది ఉద్యోగ సర్వీసు మార్చి 31, 2020తో ముగియనుంది. రూల్‌ 56 ప్రకారం వీరంతా 31వ తేది నుంచి పదవీవిరమణ పొందినట్లేనని అధికారిక మెమోరండంలో కేంద్రం స్పష్టంచేసింది.