104కు ఫోను వస్తే వెంటనే స్పందించాలి – సీఎం జగన్మోహన్

కోవిడ్‌19 నివారణా చర్యలపై సీఎం YS జగన్‌ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌19 పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని, పరీక్షల విషయంలో వెనకడుగు వద్దని, పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఏప్రిల్ 22న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామని, మొత్తంగా ఇప్పటివరకూ 48,034 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్‌కు 961 టెస్టులతో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలతో ముందుకెళ్లాలని ఆదేశించారు. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని, నిర్దేశించిన ప్రోటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయని, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌తో ఇప్పటివరకూ 14,423 పరీక్షలు 11,543 టెస్టులు రెడ్‌ జోన్లలోనే చేసిన విషయం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మొత్తం పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌లు ర్యాండమ్‌ కిట్లలో వచ్చాయని, వీటిని నిర్ధారణకోసం పీసీఆర్‌ టెస్టులకు పంపుతున్నామని, కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందన్నారు. టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సింగపూర్, చైనాల్లో మరోసారి వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైందన్నారు.

జూలైలో మరో సర్వే

తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని, ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని, డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతిపాదిత కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనేస్థలాలను గుర్తించాలని CM తెలిపారు.

ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయండి: సీఎం

గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా పంటలు పరిస్థితులు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. రూ. 100లకు వివిధ రకాల పండ్లు ఇవ్వటాన్ని కొనసాగించాలని, దీన్ని శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలి.

తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ :

గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంట పొలంలో వదిలేశారంటూ వచ్చిన కథనంతోపాటు, కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతుబజార్లకు చేరక కుళ్లిపోతున్నాయంటూ ప్రచురించిన కథనాలపై చర్చ. ఈ రెండూ తప్పుడు సమాచారంగా నివేదించిన అధికారులు కర్బూజా పంట పండించిన రైతు కుటుంబంతో మాట్లాడమని నివేదించిన అధికారులు, రెండు కోతలు కోసి పంటను ఇప్పటికే తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని, మూడో కోతలో నాసిరకం కాయలు కారణంగా వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆ కుటుంభం తెలిపినట్టుగా చెప్పారు.

విజయవాడలో అరటి గెలలు కూడా కడప నుంచి తెప్పించి, స్థానిక మార్కెట్లకు పంపించామని, అంతేతప్ప వాటిని వదిలేయలేదన్న విషయాన్ని వెల్లడించిన అధికారులు అలాగే కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ, అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను చూపిస్తున్నారని సమావేశంలో చర్చించారు.