కర్నూలు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.

కర్నూలు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదాలు తల్లిదండ్రుల కడుపుతీపికి జీవితంలో తీరని లోటును మిగులుస్తాయి. కర్నూలు నగరంలో సోమవారం రాత్రి
బళ్లారి చౌరస్తా సమీపంలో అతి వేగంతో వెళ్తోన్న లారీ రహదారిపై స్కూటిని ఢీ కొట్టడంతో వైద్య విద్య చదువుతోన్న ఓ అమ్మాయి చనిపోయింది. కర్నూల్ నగరానికి చెందిన 1998 బ్యాచ్ కానిస్టేబుల్ కాశయ్య ఒక్కగానొక్క కూతురు రోడ్డుపై వెళ్తుండగా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. కర్నూల్ నగరంలో కాశయ్య కుటుంభం బుధవారపేటలో మెడికల కాలేజీ సమీపం సన్ రైజ్ అపార్ట్ మెంటులో నివాసం ఉంటున్నారు. శ్రావణి అనే అమ్మాయి ఉద్యోగరీత్యా పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా
ఓ లారీ అనుకోకుండా ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటు
చేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి నగరంలో నెమ్మదిగా వెళ్లాలని సూచనలు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం.