కరోనాలో హైవేపై ఏమేమి ఎక్కడున్నాయి?? జాబితా??

దేశవ్యాప్తంగా డాబాలు, ట్రక్కుల మరమ్మతుల దుకాణాల జాబితా మరియు జాతీయ రహదారుల సంస్థ , రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వంటి వివిధ సంస్థల వివరాలకు సంబంధించిన డాష్ బోర్డు లింకును రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ జాబితాను

https://morth.nic.in/dhabas-truck-repair-shops-opened-during-covid-19

లింకును క్లిక్ చేయుట ద్వారా తెలుసుకొనవచ్చును. ఈ కొవిడ్-19 వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ వలన వివిధ రకాల అత్యవసర వస్తువులను వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్న ట్రక్కుల/వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల కోసం ప్రభుత్వం సౌకర్యాన్ని కల్పించింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసిలు) వంటి వివిధ భాగస్వాములతో మాట్లాడుతూ వారి నుండి స్వీకరించి డాష్ బోర్డులో అందుబాటులో ఉంచుతున్నది కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.

ట్రక్కు డ్రైవర్లు/క్లీనర్లకు అవసరమైన సమాచారం అందించడం కోసం జాతీయ రహదారులపై ఉన్న దాబాలు మరియు ట్రక్కు మరమ్మతుల దుకాణాల సమాచారాన్ని తెలపడం కోసం జాతీయ రహదారుల కేంద్రీకృత 1033 కాల్ నంబరును ఏర్పాటు చేసింది.

అత్యవసర సరుకులు మరియు వస్తువుల రవాణా చేసే సమయంలో డ్రైవర్లు, క్లీనర్లు మరియు ఇతర వ్యక్తులు డాబాలు మరియు ట్రక్కు మరమ్మతు దుకాణాల్లో సహాయ సహకారాలు అందుకునేప్పుడు అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు, సామాజిక దూరం పాటించడం, మాస్కులను ఉపయోగించడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.