చెన్నై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రోజా

చెన్నై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు వైద్యులు రెండు ఆపరేషన్లను నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు రోజాను పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. వీరిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రోజాతో కాసేపు ముచ్చటించారు. అనంతరం రోజా ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రోజా త్వరగా కోలుకోవాలని పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఆమె కోసం అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.