RRR సినిమా విడుదల ఎప్పుడు??

Jr NT రామారావు, రాం చరణ్, రాజమౌళి RRR సినిమా అంటే ఈ ముగ్గురు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా RRR టాక్ మాత్రమే నడుస్తోంది. మన తెలుగు మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రం 2021 సంక్రాంతికి విడుదల అంటూ మూవీ మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దేశ విదేశాల్లో కూడా షూటింగ్ చేయలేని పరిస్థితులు అందుకే సినిమా వాయిదా అంటూ వస్తోన్న గాసిప్స్ అన్నింటికీ RRR చిత్ర నిర్మాత డివివి దానయ్య ఖండించారు. ఖచ్చితంగా RRR చిత్రం రాబోయే సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్స్ చేస్తున్నారు. తప్పకుండా 2021 జనవరి 8రోజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.