జక్కన్న RRR మూవీ సస్పెన్స్
సోషల్ మీడియాలో టీజర్ హల్చల్
చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల
-దర్శకధీరుడు రాజమౌళి (జక్కన్న) తెరపై అద్భుతాలను సృష్టించడంలో దిట్ట. అందుకు నిదర్శనమే బాహుబలి మూవీ.
ఈ నేపథ్యంలో మరో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. RRR సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రీలిజైనది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ అనే పేరుతో ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెంటిలోనూ చరణ్ లుక్ చూస్తే జనాలకు రకరకాల సందేహాలు కలిగిస్తున్నాయి. అవి ఏమిటంటే చరణ్ బర్త్ డే టీజర్ లోని లుక్ విజువల్స్ అనేకానేక సందేహాలకు తెర తీశాయి.
మన్నెం దోరనా..? పోలీసు పాత్రనా..!:
– RRR సినిమాలో రాంచరణ్ పాత్రపై స్పష్టత లేదనిపిస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ ఈ సినిమాలో చేస్తోంది మన్నెం దొర ‘అల్లూరి సీతారామరాజు’ పాత్ర అని ముందు నుంచి టాక్. టీజర్లో కూడా వాయిస్ ఓవర్లో ఆ పాత్రను అల్లూరి సీతారామరాజుగానే అభివర్ణించారు. కానీ చరణ్ లుక్ చూస్తే మాత్రం అల్లూరి పోలికలే లేవు. అతను మిలిటరీ వాడిలా కటింగ్ చేయించుకున్నాడు. టీజర్ మొత్తంలో ప్యాంటుతోనే కనిపించాడు. అందులోనూ ఒక చోట అయితే పోలీస్ లాగా ఖాకీ ప్యాంటు – బెల్టు ధరించాడు. దీంతో టీజర్ చూసిన వాళ్లంతా అల్లూరి సీతారామరాజు ఇలా ఉండడమేంటి అంటున్నారు. అసలు చరణ్ పోలీస్ లా ఖాకీ ప్యాంటు – బెల్టు ఎందుకేశాడన్నది అంతుచిక్కకుండా ఉంది. సెట్ ప్రాపర్టీస్ చూసినా 1920 కాలం నాటివి లాగా కనిపించడం లేదు. కొన్ని దశాబ్దాల తర్వాతి కాలాన్ని సూచించేలా కథ..లాగా సినిమా ఉంటుందోమోనని అనిపిస్తోంది.
ఎన్టీఆర్ టీజర్‌పై ఉత్కంఠ:
– వీటన్నింటికీ తెరపడాలంటే ఎన్టీఆర్ టీజర్ విడుదల కావాల్సిందేనని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ టీజర్ విడుదలైతే సినిమాలో రాంచరణ్ పాత్ర ఏమిటో..? ఇట్టే అర్థం అవుతుందని సినీమా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ పాత్ర తాలూకు వీడియో టీజర్ కూడా వస్తే ఈ విషయంలో ఒక స్పష్టత రావచ్చేమో. ఇది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో సినిమాలోని పాత్రలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నెలకొంది.