RRR పూణెలో షూటింగ్‌కు రెడీ ఐన జ‌క్క‌న్న మూవీ..!

పూణెలో షూటింగ్‌కు రెడీ ఐన జ‌క్క‌న్న మూవీ..!

-టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మొన్నటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ను పూణె లో నిర్వహించేందుకు జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇప్పటికే పుణెలో షూటింగ్స్ కు అక్కడి ప్రభుత్వం నుండి అనుమ‌తి తీసుకున్నారని.. కొందరు ఇప్పటికే అక్కడకు వెళ్లి ఏర్పాట్లలో ఉన్నారంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి:
– పూణె షెడ్యూల్ లో హీరోలు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్‌, స‌ముద్రఖని ఇంకా ముఖ్య తారాగణం పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యిందని బ్యాలన్స్ షూటింగ్ ను మరో మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

చ‌ర‌ణ్‌కు జోడిగా ఆలియా భ‌ట్‌:
– ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా నటిస్తోంది. ఇంకా ఈ సినిమా లో పలువురు స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీ , ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.