రూ. 440 తగ్గిన 24 క్యారెట్ల బంగారం

రూ. 440 తగ్గిన 24 క్యారెట్ల బంగారం

బంగారానికి మన దేశంలో ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఆగస్టు నెలలో చుక్కలను తాకిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గత వారం ఏకంగా 10 గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈరోజు కూడా పసిడి ధర తగ్గింది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ. 440 తగ్గి రూ. 52,410కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 48,050కి దిగివచ్చింది. కిలో వెండి ధర రూ. 1800 తగ్గి రూ. 60,200 వద్ద కొనసాగుతోంది.