తెలంగాణ సీఎం కెసిఆర్, రైతుల ఆత్మ బంధువు. కెసిఆర్ లాంటి సీఎం ఎక్కడా లేరు. ఆయనలా రైతులకు మేలు చేస్తన్న సీఎంలు కూడా ఎక్కడా లేరు. అన్నదాతను నిజంగా ఆదుకుటున్న రైతు బంధువు ఆయనే. అన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి, రైతులనుద్దేశించి మాట్లాడారు.
మన సీఎం కెసిఆర్, రైతాంగానికి అవసరమైన సాగు నీటిని అందిస్తున్నారు. 24 గంటల పాటు కోతల్లేని, నాణ్యమైన కరెంటుని అందిస్తున్నారు. పంటలకు ఆయనే పెట్టుబడులను రైతు బంధు పేరుతో అందిస్తున్నారు. రైతాంగానికి విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచుతున్నారు. కల్తీ లేలని విత్తనాలు అందేలా చూస్తున్నారు. రైతుల పంటలు నష్టపోతే పరిహారం ఇస్తున్నారు. రైతులకు ఉచితంగా బీమా చేసి, ఒకవేళ చనిపోతే వాళ్ళ ఇళ్ళకే ఆ బీమా డబ్బులు అందేలా చూస్తున్నారు. చివరకు రైతులు పండించిన పంటలను కూడా ఆఖరి గింజ వరకూ, కనీస మద్దతు ధర దేశంలో ఎక్కడా లేని విధంగా చెల్లిస్తూ, కొనుగోలు చేస్తున్నారు. వడ్దీలేని రుణాలు ఇస్తున్నారు. ఇంతగా రైతుల కోసం పని చేస్తున్న సిఎంలు దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు వివరించారు. కరోనా కష్టకాలంలోనూ రైతుల ధాన్యం కొనుగోలు కోసం రూ.30వేల కోట్లను కేటాయించారని, మక్కల కొనుగోలు కోసం రూ3వేల కోట్లను కేటాయించారని మంత్రి ఎర్రబెల్లి రైతులకు చెప్పారు.
రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు శుద్ధి చేసి తేవాలని మంత్రి ఎర్రబెల్లి రైతులకు సూచించారు. అలాగే రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ఆ వైరస్ ని కట్టడి చేయానికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. లాక్ డౌన్ ని పాటించాలని, సీఎం కెసిఆర్ చెప్పినట్లుగా నడుచుకోవాలని చెప్పారు. లాక్ డౌన్ ని పొడిగించినా సరే, సహకరించాలని, సీఎం కెసిఆర్, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారన్నారు. ప్రజలు వైద్యులకు, అధికారులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, సామాజిక. భౌతిర దూరాన్ని పాటిస్తూ, స్వీయ నియంత్రణలో ఉండాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.