దుబాయ్ లో సాక్షి బర్త్ డే పార్టీ

దుబాయ్ లో సాక్షి బర్త్ డే పార్టీ

ఇటీవలే ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో మహేంద్ర సింగ్ ధోనీ కాస్త సేదదీరుతున్నాడు. ఈ క్రమంలో తన అర్ధాంగి సాక్షి పుట్టినరోజు రావడంతో ధోనీ దుబాయ్ లో పార్టీ ఇచ్చాడు. సాక్షి బర్త్ డే వేడుకల్లో భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా, ఆమె భర్త, పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంది.కాగా, అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ తదుపరి కార్యాచరణ ఏంటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020లో పేలవ ప్రదర్శన చూపడంతో వచ్చే సీజన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మేలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.