సెల్యూట్ 2 హైదరాబాద్ పోలీస్.

హైదరాబాద్ పోలీసులు కరోనా మహామ్మారిని అరికట్టేందుకు ఆహార్నిశలు 24/7 కృషి చేస్తున్నారు. కుటుంభం, స్నేహితులు, సంతోషాలు అన్నింటిని వదులుకుని రేయింబవళ్లు రోడ్లపై జనం సంచరించకుండా పహారా కాస్తున్నారు. హైదరాబాద్ పోలీసులకు ఎవరైనా హ్యాట్సాప్, సెల్యూట్ చేయాల్సిందే.అలాగే ఓ వైపు సోషల్ మీడియాలో కూడా లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా రోడ్లపై కరోనా ప్రతిబింబంలా హెల్మెట్స్ తగిలించి తిప్పుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే మాత్రం వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దేశంలో ఎక్కడలేనంతగా పోలీసులు జంట నగరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.