సమంతా సడిసప్పుడు లేని పుట్టిన రోజు

సమంతా తెలుగు సినిమాలో నటిస్తూ దశాబ్థకాలం కావస్తున్న కుర్రకారులో మాత్రం ఆమెకు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఏంమాయ చేసిందో ఏమో కానీ 2011లో “ఏమాయ చేసావే” సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంతా అప్పటి నుంచి తెలుగు ప్రేక్షల మన్ననలను పోందుతూనే ఉంది. ఎప్పుడు అభిమానులను మైమర్పిస్తూ ఉండే “స్యామీ” జపమే కుర్రకారు చేస్తూ కలవరిస్తున్నారు.

ఈ తేనెటీగ తన అందచందాలతోనే కాదు నటనతోను చూపరులను మంత్ర ముగ్దులను చేసేసి మనసులో కట్టి పారేసుకుంటది. సినీ ప్రపంచంలోకి అడుగెట్టి తొమ్మిది
ఏళ్లే అయినా సమంత తన గ్లామరుతో, నటనా సామర్థ్యంతో తెలుగు, తమిళ, మళియాల సినిమాల్లో టాప్ పొజిషనులో పరుగులు పెడుతూనే ఉంది. ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాలు దాదాపు బాక్సాపిస్ దగ్గర హిట్టయ్యాయి. తెలుగుతో పాటు అన్నీ సినిమా వుడ్స్ లో నటించి మెప్పించి మంచి కలక్షన్స్ వసూలు రాబట్టింది.

ఈ వివరాలన్నీ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా అదేం లేదండీ ఏప్రిల్28 మంగళవారం ఈ అక్కినేని అమ్మడు సమంత 33వ పుట్టినరోజు కావడంతో మీ ముందుకు ఈ సమాచారం తీసుకు వస్తున్నాము. సమంతా హీరోయిన్
అనే విషయాలు మాత్రమే మనకు తెలుసు కానీ అసలు ఆసక్థికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం,

సమంతా పూర్తి పేరు సమంతా రూత్ ప్రభూ, తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టి పెరిగింది. 1987 ఏప్రిల్ 28న జన్మదినం. తల్లిదండ్రుల్లో నాన్న తెలుగు జోసఫ్ ప్రభు, అమ్మ మళయాలం నిన్నేటీ ప్రభూ, సమంతాకి జోనాతన్ ప్రభూ, డేవిడ్ ప్రభూ ఇద్దరూ అన్నలు ఉన్నారు. చదువు డిగ్రి పూర్తి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలో నటించాలనే ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది.

ఏం మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత ప్రేక్షకుల్ని తన అందచందాలు, అభినయంతో అందర్ని మంత్ర ముగ్ధుల్ని చేసుకుంది. ఆమెను చూసి కుర్రకారు ఎటో వెళ్లిపోయింది మనస్సు అనే అక్కినేని మామ పాట పాడుకుంటారు. బృందావనంలో ఎన్టీఆర్ సరసన, ప్రిన్స్ మహేశ్ బాబు ఇద్దరు కలిసి దూకుడులో నటిస్తే ప్యాన్స్ నటనకు నీరాజనాలు పలికారు.

ఆమెలో ఎవ్వరకి లేనివిదంగా సంథింగ్, సంథింగ్ ఉందనుకుంటారు ప్రేక్షకులు, కొన్ని రోజులకే ప్రేక్షకులని జబర్ధస్త్ మైమరిపింప చేసేసింది. రామయ్యా వస్తావయ్యా అంటూ మరో సారి ఎన్టీఆర్ సరసన ఊరించింది. మరో బ్లాక్ బస్టర్ సీనిమా “ఈగ”లావచ్చి అందరి కుట్టేసింది. విక్టరీ వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా నిలిచి మరో యాంగిల్ సత్తా ఏంటో చూపించింది. పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది అంటూ తెలుగు సినిమాలో తనకు ఎవరూ సాటిలేరని కర్చీఫ్ వేసుకుని కూర్చొంది. ఆటోనగర్ సూర్యతో కలిసి మనం అంతా ఒకటే అంటూ కొంత సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ స్యామికుట్టి.

ఇక తమిళంలో విన్నత్తండి వరువాయ (ఏం మాయ చేశావే), మోసువిన్ కావేరి, నాన్ ఈ (ఈగ) వంటి సినిమాల్లో చేసిన సమంత ఆ తర్వాత వేంటనే బన్నితో సన్నాఫ్ సత్యమూర్తితో హిట్ కోట్టేసింది. అలాగే పెద్ద సినిమాల గురించి పక్కన ఉంచితే అ..ఆ వంటి చిన్న చిత్రం కూడా సమంత ఉండబట్టే హిట్ అయిందని ప్రేక్షకుల నమ్మకం. ఆమె నటించిన 24వ సినిమా బ్రహ్మోత్సవం అంతగా విజయం సాధించకపోయినా జనతాగ్యారేజ్ తో దుమ్ము మరోసారి దులిపేసింది.

వ్యక్తిగతంగా నాగ చైతన్యకు మంచి స్నేహం ఉండటంతో ఇరువురు పెళ్లి చేసుకోవడంతో అక్కినేని కొడలుగా కొత్త అవతారం ఎత్తింది. కానీ కరోనా సమయంలో సైలెంటుగా క్వారంటైనులో సడిసప్పుడు కాకుండా కూర్చోనుంది. ఏమైనా మాయ చేయగలిగే సమంతకు శత వసంతాలు సంతోషంగా ఉండాలని పుట్టిన రోజు శుభాకాంక్షలు.