కరోనాపై ఇసుక కళాద్భుతం అదరహో…

కళలు ప్రజల్ని ఉత్తేజ పరుస్తాయి. కళలు ప్రజలను జాగృత పరుస్తాయి. కళలకు ఎల్లలు ఉండవు. కళలు ప్రజల మనస్సులకు శాంతన చేకూరుస్తాయి. ఇసుక కళతో కరోనా వైరస్ సోకకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంపై ప్రముఖ సైకత ఆర్టిస్ట్ వేణుగోపాల్ ఓ అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రజల్లో భయం వద్దని, జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సైకత ఆర్టిస్ట్ ఓ దృశ్య రూపాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.

కరోనా మహామ్మారి వైరస్ అరికట్టడంలో సేవలు, కృషి చేస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఈ ఇసుక కళ రూపంలో ఆర్టిస్ట్ వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.

కరోనా వైరస్‌పై అవగాహన కోసం ఇసుక కళతో కళాకారులు వేణుగోపాల్‌ అద్బుత ప్రతిభను చూపడంపై రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రశంసించారు. కళతో సృజనాత్మక పద్ధతితో కరోనా మహామ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యాచరణను ఎంపీ సంతోష్ కొనియాడారు. బొమ్మల రూపంలో అద్భుతమైన కళతో ప్రజలందరికీ కోవిడ్-19పై అవగాహన కల్పించే ప్రయత్నంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.