టాప్స్ లో చోటు సంపాదించుకున్న సానియా

టాప్స్ లో చోటు సంపాదించుకున్న సానియా

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఈ సంవత్సరం టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ లో టెన్నిస్ పోటీలకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ లో ప్రత్యేక ర్యాంకింగ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని సానియాను ఎంపిక చేసినట్టు అధికారులు ప్రకటించారు.దీంతో ఆమె దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్)లో చోటు సంపాదించుకున్నట్లయింది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో ఉన్న సానియా, ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, పెరిగిన వయసు, ఫిట్ నెస్ నేపథ్యంలో టెన్నిస్ విభాగంలో సానియా మీర్జా పతకాన్ని అందించడం అంత సులువేమీ కాదని, ఎంతో శ్రమించాల్సి వుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.