‘సర్కారువారి పాట’ షూటింగు వాయిదా

‘సర్కారువారి పాట’ షూటింగు వాయిదా

మహేశ్ బాబు తాజా చిత్రంగా దర్శకుడు పరశురామ్ ‘సర్కారువారి పాట’ సినిమాను రూపొందిస్తున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ .. 14 రీల్స్ ప్లస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, మాహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. నిన్నమొన్నటివరకూ సెట్స్ పై ఉన్న ఈ సినిమా, కరోనా కారణంగా షూటింగును వాయిదా వేసుకుంది.ఈ సినిమా కోసం దుబాయ్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. మహేశ్ బాబు కెరియర్లోనే ఇది రిస్కీ ఫైట్ అని చెబుతున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగానే ఖర్చు చేశారట. ఆ ఖర్చు అంతా కూడా తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు.ఇక కృష్ణ పుట్టినరోజైన మే 31వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ రావొచ్చని అంటున్నారు. ఇక మహేశ్ బర్త్ డేకి టీజర్ ను వదిలే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.