ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు అల్లోపతిలో వైద్యం ఇంకా పరిశోదన దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జరగరాని ప్రాణనష్టం జరిగిపోతూనే ఉంది. రోజు లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడుతుండగా.. వేల సంఖ్యల్లో పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరోవైపు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముందున్న మార్గాలు. భారతీయ వైద్య విధానంలో యోగా ద్వారా కరోనా వైరస్ దరిచేరనీయకుండా నిరోధించవచ్చంటున్నారు యోగా నిపుణులు.
మరోవైపు లాక్డౌన్ ఎత్తేశాక చైనా కూడా భారతీయ యోగా, ఆయుర్వేద వైద్యానికి జై కొడుతోంది. యోగా, ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ప్రజలను కోరుతోంది చైనా. ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను కల్పించడం ద్వారా భారతీయ యోగా విలువ ప్రపంచానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. కరోనా వైరస్ మృత్యుఘంటికలు మ్రోగిస్తున్న విపత్కర సమయంలో ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు భారతీయ యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత ప్రక్రియల వ్యాయామంపై పడింది.కరోనా వైరస్ దాడి నుంచి బయటపడానికి యోగా, ప్రాణాయమం, ధ్యానంపై దృష్టిసారించారు చైనీయులు. యోగాలో సూర్యనమస్కారం, ప్రాణాయమంలో కపాలభాతి, భస్త్రిక, అనులోమ్ విలోమ్ ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బ్రీతింగ్ సామర్ఝధ్యం కూడా పెరుగుతుంది. కరోనా వైరస్ సంక్రమించిన వారికి జలుబు, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కపాలభాతి, భస్త్రికతో పాటు అనులోమ్, విలోమ్ సాధన చేయాలి. కపాలభాతి లో జ్ఞానముద్రలో కూర్చోవాలి. ఒక సారి సాధారణంగా శ్వాసను తీసుకుని సేకను ఒక స్ట్రోక్ చొప్పున చేయాలి. శ్వాస తీసుకునే శబ్దాన్ని కాకుండా, శ్వాస వదిలే శబ్దాన్నివినాలి. ప్రాథమిక దశలో ఒక రౌండ్లో పది సార్లు గాలిని బలంగా బయటకు బదలాలి. అలా పది రౌండ్లు చేయాలి. నిరంతర సాధనతో గాలిని బయటకు వదిలే రౌండ్ల సంఖ్యను పెంచుకోవాలి. నోటితో కాకుండా కేవలం ముక్కు ద్వారానే కడుపులో ఉన్న గాలిని బలంగా బయటకు తీయాలి. ఇలా చేయడం ద్వారా మలినాలు బయటకు పోతాయి. శ్వాస సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. బ్రీథింగ్ సామర్ద్యం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇక బస్త్రికలో … ముక్కుతో శ్వాసను తీసుకుని వదలాలి. డీప్ ఇన్హెలింగ్, డీప్ ఎగ్జేలింగ్. ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుతుంది. ప్రారంభంలో పది రౌండ్లు చేయాలి. సాధన ద్వారా వంద రౌండ్ల వరకు చేయాలి. అనులోమ్, విలోమ్లో ముక్కులోని ఎడమ రంద్రం నుంచి గాలిని పీల్చుకుని కుడి వైపు నుంచి వదలాలి. ఆ తరువాత కుడివైపు నుంచి గాలిని పీల్చుకుని ఎడమ వైపు నుంచి వదలాలి. ఇలా పది సార్లు చేయాలి. ఆ తరువాత సాధన ద్వారా పెంచుకోవాలి.
వీటితో పాటు సూర్యనమస్కారాలు చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోజంతా కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం.
యోగా, ప్రాణాయమంతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రోజులో కనీసం నాలుగైదు సార్లు వేడినీళ్లతో పుక్కిలించాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా గొంతు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. విటమిన్ సి లభ్యమయ్యే పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ మన దరిదాపుల్లోకి రాదు.
త్రివేణి శ్యామ్
(డిప్లోమా ఇన్ యోగా, భారతీయ విద్యాభవన్, న్యూఢిల్లీ)