మీ పంచ ప్రాణాలే ముఖ్యం జాగ్రత్త

ప్రపంచమే అతలాకుతలం అవుతోన్న సమయం, మనిషి మనుగడమే ముప్పు పొంచి ఉన్న కాలం, ఏడు ఖండాలు బోరున ఏడుస్తోన్న వేల మీ ఉద్యోగాలు ముఖ్యమా లేక ప్రాణాలా? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇరువురు ముక్త కంఠంతో ప్రజలందరూ పంచ ప్రాణాలు కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యంగా జాగ్రత్తలు అత్యవసరమని హెచ్చరిస్తున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం మానవాళి చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగాలంటే కరోనా కట్టడి చేయాల్సిందే అంటూ WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌, IMF ఎండీ క్రిస్టాలినా జార్జీవా తేల్చారు. చైనాలో వెలుగుచూసిన నావెల్‌ కరోనా వైరస్‌ కారణంగా దేశ విదేశాల్లో లాక్‌డౌన్‌లో నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 50వేలకు పైగా మృతుల సంఖ్య నమోదైంది. ఈ దుర్భర పరిస్థితులపై వారిద్దరూ బ్రిటిష్‌ పత్రిక ‘THE DAILY TELEGRAPH’’కు సంయుక్తంగా ఓ కథనం రాశారు. చాలా దేశాల్లో ప్రజల ప్రాణాలా లేక ఉద్యోగాలు కాపాడాలా ఆలోచనలు సాగుతున్నాయి. అందుకు ముందు వైరస్‌ను పారద్రోలి ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ఓని చేయాలని అభిప్రాయబడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం రెండు ఒకటికొకటి ముడిపడి ఉన్నాయని ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రపంచమంతా ఐక్యంగా కలిసి పనిచేయాల్సిన అత్యవసరముందని WHO, IMF ఇరువురు తెలిపారు.