కరోనా యుద్ధంలో SCTIMST ఆయుధాలు

దేశంలోని చిత్ర మాగ్నా పేరుతో వినూత్నఆర్ ఎన్ ఎ వెలికితీత కిట్ ను శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST) సంస్థ‌ అభివృద్ది చేసింది. భార‌త ప్ర‌భుత్వ డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ కింద ప‌నిచేస్తున్న ‌ జాతీయ ప్రాధాన్య‌తా సంస్థ ఇది. కోవిడ్ -19 ప‌రీక్ష‌ల కోసం స్వాబ్ ల‌నుంచి ఆర్‌.ఎన్.ఎను వేరు చేసే వినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానం ఇది.

కోవిడ్ -19 మ‌హ‌మ్మారికి కార‌ణ‌మయ్యే సార్స్‌-సిఒవి -2 అనేది ఒక ఆర్‌.ఎన్‌.ఎ వైర‌స్‌. ఇది జీవితానికి అవసరమైన జీవి జన్యు సమాచారాన్ని కలిగి ఉన్న అన్ని జీవ కణాలలో గ‌ల‌ పొడవైన సింగిల్-స్ట్రాండ్ పాలిమెరిక్ పదార్థం.

గొంతు లేదా ముక్కు నుండి తీసిన నమూనాలో వైరస్ కు సంబంధించిన ఆర్‌.ఎన్‌.ఎ ఉనికిని నిర్ధారించడం ఈ వైరస్‌ను గుర్తించడంలో కీలకమైన దశలలో ఒకటిగా చెప్పుకోవ‌చ్చు.. సేకరించిన నమూనా ను వైర‌ల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియంలో నిర్దేశిత విధంగా పరీక్షా కేంద్రానికి పంప‌డం జ‌రుగుతుంది.

రోగి నమూనా నుండి ఆర్.ఎన్‌.ఎ ను సేక‌రించ‌డానికి , దానిపై కేంద్రీకరించడానికి, అయస్కాంత నానోపార్టికల్స్‌ను కిట్ ప్రొటోకాల్ ఉపయోగిస్తుంది. ఇది చెప్పుకోద‌గిన ప్రయోజనం క‌లిగిన‌ది. ఎందుకంటే రోగి నుంచి సేక‌రించిన నమూనాల నిల్వ , రవాణా సమయంలో ఏదైనా వైరల్ ఆర్‌.ఎన్‌.ఎ విచ్ఛిన్నమైతే, దీనిని అయస్కాంత బెడ్ -ఆధారిత వెలికితీత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమీక‌రించ‌డం జ‌రుగుతుంది.

అయస్కాంత నానోపార్టికల్ బెడ్‌లు వైరల్ ఆర్ ఎన్ ఎ తో క‌లిసి ఉంటాయి. ఇవి అయస్కాంత క్షేత్ర ప్ర‌భావానికి గురైనప్పుడు, బాగా శుద్ధి చేయబడిన సాంద్ర‌త క‌లిగిన‌ ఆర్‌.ఎన్.ఎ ని ఇస్తాయి. పిసిఆర్ లేదా లాంప్‌ పరీక్ష ఫ‌లితం తగినంత పరిమాణంలో వైరల్ ఆర్ ఎన్ ఎ ను పొందడంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ ఆవిష్కరణ కోవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించే అవకాశాలను పెంచుతుంది. ఈసంస్థ ఈ సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించిన పేటెంట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. దిగుమ‌తి చేసుకునే కిట్ ల కంటే ఇది చాల సుల‌భ ప‌ద్ధ‌తి క‌లిగిన‌ది.

చిత్ర మాగ్నాను, రోగి నమూనాల నుండి అధిక స్వచ్ఛత గ‌ల ఆర్‌.ఎన్‌.ఎ ను ల్యాంప్ పరీక్ష కోసం మాత్రమే కాకుండా ఆర్‌.టి-పిసిఆర్ పరీక్ష కోసం కూడా సేకరించవచ్చు. ఏ విధంగా పాడైపోకుండా అధిక నాణ్యత అధిక సాంద్రత కలిగిన ఆర్‌ఎన్‌ఎను వేరుచేసే తొలి ద‌శ‌, పిసిఆర్ లేదా లాంప్ పరీక్షా ఫలితానికి కీలకం, దీనిలో ఆర్‌ఎన్‌ఎ, డిఎన్‌ఎగా మార్చబడుతుంది.

కొంతమంది భారతీయ తయారీదారులను మినహాయించి, ఎక్కువ శాతం ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్ కిట్లు మ‌న‌దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. వాటి లభ్యత తరచుగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆర్‌.టి-పిసిఆర్‌ పరీక్షకు తీవ్రమైన అడ్డంకిగా మారుతున్న‌ది.

రోగి నమూనాల నుండి ఆర్ ఎన్ ఎ ను సేక‌రించ‌డం, దానిపై కేంద్రీకరించడం అనేది , కోవిడ్ -19 వైరస్ నిర్ధారణ పరీక్షలలో మొదటి క్లిష్టమైన దశ. అయస్కాంత క్షేత్రాన్ని వర్తింపజేయడం ద్వారా ఆర్‌.ఎన్‌.ఎ ను అయస్కాంత నానోపార్టికల్స్‌తో కలపడం , వాటి ఏకాగ్రతను ఒకే చోట పెంచే వినూత్న ప్రక్రియ ఎస్‌సిటిఐఎంఎస్‌టి కొత్తగా అభివృద్ధి చేసిన‌ ఆర్‌.టి- ల్యాంప్ పరీక్ష ఒక గొప్ప‌ పురోగతిగా చెప్పుకోవ‌చ్చు. మల్టీడిసిప్లినరీ , ముందుచూపు అనేవి మంచి విజ్ఞాన శాస్త్ర ల‌క్ష‌ణాలు, ఈ ఉదాహరణకు ఇది స‌రిగ్గా స‌రిపోతుంది అని “అని డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు

చిత్ర మాగ్నా సాంకేతికతను అగప్పే డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ ఎర్నాకుళానికి బదిలీ చేశారు. సార్స్ సిఒవి-2 కు సంబంధించిన ఎన్‌ జన్యువును గుర్తించడానికి ఆర్‌.టి – ల్యాంప్‌ ను ఉపయోగించే చిత్ర జీన్ లాంప్-ఎన్ టెక్నాలజీని కంపెనీ ఇప్పటికే తీసుకుంది

ఇది ఐసిఎంఆర్ చే ఎన్‌.ఐ.వి వద్ద ప్రారంభ ధ్రువీకరణలో ఆర్‌టి-పిసిఆర్‌ తో సరిపోయే ఖచ్చితత్వంగ‌ల నిర్ధారణ పరీక్ష. టెస్ట్ కిట్లు ఇప్పుడు ఐసిఎంఆర్ ఆమోదం కోసం పెద్ద పరీక్షా నమూనాలలో వాలిడేట్ చేస్తున్నారు, ఆపైన‌ డిసిజిఐ నుండి వాణిజ్య తయారీ లైసెన్స్ ఉంది. చిత్ర జెనెలాంప్-ఎన్ ను అభివృద్ధి చేసిన డాక్టర్ అనూప్ తెక్కువేట్టిల్ , అతని బృందం చిత్ర మాగ్నా సాంకేతికతను అభివృద్ధి చేసింది. శ్రీ చిత్ర భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.