కరోనాపై పరిశోధన, అభివృద్ధి, సాంకేతికత, ఉత్పత్తులతో సిద్దమైన SCTIMST

కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం కొనసాగిస్తున్న పోరులో తన వంతు బాధ్యతగా భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ కింద జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ శ్రీ చిత్ర తిరుణాల్ వైద్య శాస్త్ర, సాంకేతిక సంస్థ (SCTIMST) తన పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణలతో సహకరిస్తోంది.

జాతీయ స్థాయిలో లాక్ డౌన్ విధించడానికి చాలా ముందే ఈ సంస్థకు చెందిన ఒక డాక్టర్ విదేశాల నుండి తిరిగి వచ్చి కోవిడ్-19 కి గురి కావడంతో సిబ్బంది క్వారంటైన్ కి వెళ్ళవలసివచ్చింది. వెంటనే ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. రంగంలోకి దిగి, ఈ రోగాన్ని అరికట్టడానికి అవసరమైన అనేక సాంకేతికతలను, ఉత్పత్తులను రూపొందించడానికి నడుం బిగించింది. మొదటి చర్యగా – భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన కోవిడ్-19 ను ధృవపరిచే డయాగ్నొస్టిక్ కిట్ ను మూడు వారాల్లో అభివృద్ధి చేసింది. మిగిలిన పరిశోధన, అభివృద్ధి పనుల్లో భాగంగా – ఆసుపత్రుల్లో ఆరోగ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు వినియోగించిన ఫేస్ మాస్క్ లు, ఓవర్ హెడ్ కవర్లు, ఫేస్ షీల్డులను ప్రక్షాళణ చేయడానికి ఉపయోగపడే యు.వి. ఆధారిత ఫేస్ మాస్క్ డిస్పోజల్ బిన్, ద్రవ శ్వాసకోస సంబంధమైన పదార్ధాలను పీల్చే పదార్ధం, వైరస్ సోకిన శరీరంలోని శ్వాసకోశ స్రావాలను పటిష్టంగ, సురక్షితంగా చేసే క్రిమిసంహారకాన్నీ, కోవిడ్-19 రోగులను పరీక్షించడానికి వీలుగా క్రిమిసంహారకాలను అడ్డుకునే పరీక్షా బూత్ ను ఈ సంస్థ ద్వారా కనుగొన్నారు.

కోవిడ్-19 ను గుర్తించే రోగ నిర్ధారణ, విశ్లేషణ పరీక్ష కు 10 నిముషాలు పడుతుంది. నమూనా తీసుకున్న తర్వాత ఫలితం రావడానికి (శ్వాబ్ లో ఆర్.ఎం.ఏ. తీసిన దగ్గర నుండి ఆర్.టి.-లాంప్ గుర్తించే వరకు సమయం) రెండు గంటల లోపు పడుతుంది. ఈ విధమైన పరీక్ష చేసే ప్రపంచంలోని అతి కొద్ది పరికరాలలో ఇది ఒకటి. ఒక పరికరంపై, ఒక బ్యాచ్ కింద మొత్తం 30 నమూనాలను ఒకే సారి పరీక్షించవచ్చు. అందువల్ల తక్కువ వ్యయంతో వేగంగా నమూనాలను పరీక్షించడానికి అవకాశం ఉంది.

ఫేస్ మాస్క్ వంటి ఉపయోగించిన వస్తువులను ప్రక్షాళన చేసి, ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చిత్ర యు.వి. ఆధారిత ఫేస్ మాస్క్ డిస్పోజల్ బిన్ ఉపయోగపడుతుంది. ఈ పరిజ్ఞానాన్ని కేరళ, ఎర్నాకులం లోని హెచ్.ఎం.టి. మెషిన్ టూల్స్ సంస్థకు బదిలీ చేయడమైనది. ఆసుపత్రి సిబ్బందికి వ్యక్తిగత వైరస్ వ్యాప్తి ప్రమాదం నుండి తగ్గించడానికి ద్రవాలను పీల్చే పదార్ధంతో తయారుచేసిన “చిత్ర అక్రిలోసార్బ్ సెక్రెషన్ సోలిడిఫికేషన్ సిస్టం” బాగా పనిచేస్తుంది. సీసాలు, చిన్న చిన్న డబ్బాలను శుభ్రపరిచి, తిరిగి వాటిని క్షేమంగా, సులువుగా వాడుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. వైద్యులు రోగిని చేతితో తాకకుండా పరీక్షించడానికి వీలుగా “డిస్-ఇన్ ఫెక్టె డ్ ఎగ్జామినేషన్ బూత్” ను రూపొందించారు. అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా రోగిని పరీక్షించడానికి ఉపయోగపడే ఈ బూత్ ఒక టెలిఫోన్ బూత్ లాగా ఉంటుంది.

కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశం చేస్తున్న కృషికి మద్దతుగా, వైద్య పరికరాల అభివృద్ధి, తయారీని వేగవంతంగా చేపట్టడం కోసం ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. వివిధ ఉత్పత్తిదారులు / అంకురసంస్థలు / సామాజిక బృందాలను ఆహ్వానించింది. ఇందుకోసం సంస్థ పేర్కొన్న జాబితాలో అంబు ఆధారిత వెంటిలేటర్ అభివృద్ధి, వెంటిలేటర్ షేరింగ్ కిట్, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే బాటరీ తో పనిచేసే పరికరం, ఐసోలేషన్ పోడ్స్, డిస్పోజబుల్ సేఫ్టీ ఫేస్ షీల్డ్, డిప్లొయబుల్ ఫీల్డ్ యూనిట్లు మొదలైనవి ఉన్నాయి. అత్యవసర వెంటిలేటర్ విధానం ప్రోటో టైప్ ను సంయుక్తంగా నిర్మించడం కోసం ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. సంస్థ బెంగళూరు లోని విప్రో – 3డి సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి అభివృద్ధి చేసిన చేతితో పనిచేసే కృత్రిమ శ్వాస యూనిట్ (అంబు) ఆధారంగా దీనిని నిర్మించి క్లినికల్ ట్రయల్స్ వేసి, ఉత్పత్తి ప్రారంభించనున్నారు.

ఈ సంస్థకు మూడు విభాగాలు ఉన్నాయి. ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాంప్లెక్స్, ఒక బయోమెడికల్ టెక్నాలజీ విభాగం, ఒక ప్రజా ఆరోగ్య పరిశోధనా కేంద్రం (అచ్యుతమీనన్ ఆరోగ్య శస్త్ర అధ్యయనాల సంస్థ), ఒక బయోమెడికల్ పరికరాల సాంకేతిక పరిశోధనా సంస్థ. గుండె సంబంధమైన, నరాల సంబంధమైన అనారోగ్యాలకు నాణ్యమైన, ఆధునిక చికిత్స. బయోమెడికల్ పరికరాలు, పదార్ధాల సాంకేతిక అభివృద్ధి, ప్రజా ఆరోగ్య శిక్షణ, పరిశోధన లపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి సంస్థకు విశ్వ విద్యాలయ హోదా ఉంది. అత్యుత్తమ పరిశోధన, శిక్షణ సదుపాయాలను ఇది కల్పిస్తుంది. ఆయా రంగాల్లో నిపుణులు ఇక్కడ తమ సేవలందిస్తున్నారు. దేశం అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుత సంక్షోభ సమయంలో, ఈ సంస్థ సకాలంలో స్పందించి, ఎంతో ఉత్సాహంతో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.