ముంబైలో మే 17 వరకు సెక్షన్ 144 విధింపు

మెడికల్ సంబంధించిన వ్యక్తులు తప్ప, మినహా అన్ని అనవసర సేవలకు ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువగా ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు బయటికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు ముంబై పోలీసులు. మన దేశం అంతటితో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో అందులో ముంబై నగరంలో నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు కరోనా మహామ్మారి కేసులు పదుల సంఖ్యలో పాజిటివ్ నమోదుఅవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే ముంబై పోలీసులు కరోనా కట్టడికి ఈ నిర్ణయం ప్రకటించారు.