సీనియర్ సిటిజన్స్ కోవిడ్-19 జాగ్రత్తలు

COVID-19 సంక్షోభ సమయంలో వయో వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు

COVID-19 కాలంలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది

ఈ విపత్కర కాలంలో సీనియర్ సిటిజన్లు మరియు వారి సంరక్షకులు ఎలా తమని తాము రక్షించుకోవాలన్న దానిపై సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు జెరియాట్రిక్ మెడిసిన్, ఎయిమ్స్ విభాగం, న్యూ ఢిల్లీ వారు పలు జాగ్రత్తలు సూచించారు.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఈ నేపథ్యంలో 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వయోజనులు (వృద్ధులు) ముఖ్యంగా షుగర్, బిపి ఆస్త్మా గుండెజబ్బులతో వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం వారి సూచనల పాటించవలసినది!!
ఇంటిలోనే ఉండండి సురక్షితంగా ఉండండి!!
సమాజాన్ని కాపాడండి!!
______________________
స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ కమాండ్ కంట్రోల్