APకి లక్ష ర్యాపిడ్‌ కిట్లు వచ్చాయ్…

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహామ్మారి వైరస్ పరీక్ష నిర్ధారణ కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు వచ్చాయి. సియోల్‌ నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానం ద్వారా తీసుకు వచ్చారు. AP CM క్యాంపు కార్యాలయంలో టెస్టు కిట్లను ముఖ్యమంత్రి జగన్ అందుకుని పరీక్షల నిర్ధారణ కోసం వైద్యులకు పంపిస్తున్నారు.

ఈ ర్యాపిడ్ కిట్లతో వెంటనే అతి తక్కువ వ్యవధిలో ఫలితం వస్తోందని, కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామన్న AP ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కిట్లన్నింటిని 4–5 రోజుల్లో అన్ని జిల్లాలకూ సరఫరా చేయబోతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ , సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ హాజరయ్యారు.