దేశంలో రవాణా కాల్ సెంటర్

లాక్ డౌన్ సమయంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ కార్యక్రమాలు మరియు రైతులకు సదుపాయాలు కల్పించడం కోసం అవసరమైన చర్యలు

వ్యవసాయ సహకార మరియు రైతు సంక్షేమ శాఖ వారు దేశ వ్యాప్తంగా వ్యవసాయ రవాణా కోసం కాల్ సెంటర్లు 18001804200 మరియు 14488 ప్రారంభం.

8.31 కోట్ల రైతు కుటుంబాల కోసం ప్రధాన్ మంత్రి-కిసాన్ పథకం క్రింద రు.16,621 కోట్లు విడుదల. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం క్రింద రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 3,985 మి.టన్నుల పప్పుధాన్యాల రవాణా.

లాక్ డౌన్ సమయంలో రైతుల సంక్షేమం కోసం క్షేత్ర స్థాయి కార్యక్రమాల నిర్వహణ కోసం వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. వాటి వివరాలు:

1.రాష్ట్రాల మధ్యన మరియు రాష్ట్రంలోపల కూరగాయలు మరియు పండ్లు, వ్యవసాయ విత్తనాలు, పురుగు మందులు మరియు ఎరువులు వంటి సరఫరా కోసం సయన్వయం కోసం దేశవ్యాప్త వ్యవసాయ రవాణా కాల్ సెంటర్ 18001804200 మరియు 14488ను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. ఈ నెంబర్లకు ఏ మొబైల్ ఫోన్ నుండి కానీ లేదా లాండు ఫోన్ నుంచైనా చేయవచ్చు.

2.ఈ వస్తువులను రాష్ట్రంలో సరఫరా కోసం సమస్యలు ఎదుర్కొంటున్న ట్రక్కుల డ్రైవర్లు, వ్యాపారులు, చిరువ్యాపారులు, రవాణాదారులు లేదా ఇతర భాగస్వాములు ఈ కాల్ సెంటర్కు సహాయం కోసం ఫోన్ చేయవచ్చు. కాల్ సెంటర్ల నిర్వాహకులు వాహనాలు మరియు సరుకు వివరాలతోపాటు అవసరమైన సహాయాన్ని అందిస్తారు, ఇందకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు.

3.ఈ పథకం క్రింద 10 సంవత్సరాల లోపు విత్తన రకాలకు రాయితీని జాతీయ ఆహార భద్రతా మిషన్ క్రింద రాష్ట్రాలకు విత్తనాల సరఫరాకు హామీ. జాతీయ ఆహార భద్రతా మిషన్ క్రింద ఈశాన్య రాష్ట్రాలకు, కొండ ప్రాంతాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము మరియు కాశ్మీర్లకు మాత్రమే ఈ రకమైన ప్రామాణికత ముద్రించిన రాయితీ విత్తనాలను అందిచాలని నిర్ణయించారు.

4.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పిఎం-కెఐఎస్ఏఎన్) పథకం క్రింద 24.03.2020 నుండి ఈ లాక్డౌన్ కాలానికి సుమారు 8.31 కోట్ల రైతు కుటుంబాలు లబ్ది పొందాయి మరియు ఇప్పటి వరకు రు.16,621 కోట్లు విడుదల చేయబడ్డాయి.

5.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పిఎం-జికెవై) పథకం క్రింద రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 3,985 మి.టన్నుల పప్పుధాన్యాలు రవాణా చేయబడ్డాయి.

6.పంజాబ్ రాష్ట్రంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన(పికెవివై) పథకం క్రింద ప్రత్యేకంగా ఆకృతిచేసిన వ్యాన్లలో సేంద్రియ ఉత్పత్తులను ప్రజలకు ఇళ్ళ వద్దే అందిస్తున్నారు.

7.మహారాష్ట్రలో ఆన్లైన్/ ప్రత్యక్ష పద్దతుల్లో 21,11,171 క్వింటాళ్ళ పండ్లు మరియు కూరగాయలు 27,797 ఎఫ్పిఓల ద్వారా విక్రయం జరిగింది.