సాగర్ లో టీఆర్ఎస్ విజయంపై షర్మిల స్పందన

సాగర్ లో టీఆర్ఎస్ విజయంపై షర్మిల స్పందన

తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆమె, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు టీఆర్ఎస్ పార్టీని అభినందిస్తున్నానని తెలిపారు. కరోనా రెండో వేవ్ ను కూడా కేసీఆర్ లెక్కచేయలేదని అభిప్రాయపడ్డారు.”కరోనా ను సైతం లెక్క చేయకుండా నాగార్జునసాగర్ లో ఎన్నికలు జరిపించి విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని కోరుతున్నాం” అని అన్నారు.