పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్న షర్మిల 

పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్న షర్మిల 

తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్న వైఎస్ షర్మిల నేడు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం షర్మిల, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హైదరాబాదు నుంచి ఖమ్మం బయల్దేరారు. కొద్దిసేపటి కిందట షర్మిల కాన్వాయ్ సూర్యాపేట చేరుకోగా, ఘనస్వాగతం లభించింది. పిట్ట రాంరెడ్డి వర్గం దాదాపు 5 వేల మందితో షర్మిలకు సూర్యాపేటలో అదిరిపోయేలా స్వాగతం పలికింది.అక్కడ్నించి ఆమె ఖమ్మం పయనమయ్యారు. షర్మిల ఖమ్మం శివారు ప్రాంతం పెద్దతండా వద్ద వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆపై పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మ కూడా వస్తుండడంతో ఈ సభపై ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ వర్గాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.