వైయస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

వైయస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

జై తెలంగాణ అంటూ వైయస్ షర్మిల నినదించారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైయస్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో జై తెలంగాణ, జై వైయస్సార్ అని ఆమె నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. ప్రజలకు చేయాల్సినవన్నీ ప్రభుత్వం చేస్తోందా? అని అడిగారు. తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటిపై మాట్లాడదామని అన్నారు. రైతులు, విద్యార్థులు, పేదలకు ఉపయోగపడేలా దివంగత వైయస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో మళ్లీ రాజన్న కాలంనాటి స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామని చెప్పారు. కులమతాలకు అతీతంగా వైయస్ పాలించారని అన్నారు. 11 ప్రశ్నలతో ఉన్న ఫీడ్ బ్యాక్ ఫామ్ ని నింపాలని అభిమానులను ఆమె కోరారు.